పవన్ కల్యాణ్ పెద్ద స్టార్ కావడం వల్లే నేను పెద్ద మాస్టర్ నయ్యాను: స్టార్ మేకర్ సత్యానంద్

  • నా మొదటి శిష్యుడు పవన్ కల్యాణ్
  • 107 మంది హీరోలు, 70 మంది ఆర్టిస్ట్ లను తయారు చేశా
  • మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ వల్లే నేను వృద్ధిలోకి వచ్చా
తన మొదటి శిష్యుడు పవన్ కల్యాణ్ అని, ఆయన పెద్ద స్టార్ కావడం వల్లే తాను పెద్ద మాస్టర్ ని అయ్యానని నటీనటులకు శిక్షణ ఇచ్చే సత్యానంద్ మాస్టర్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు 107 మంది హీరోలను, 70 మంది ఆర్టిస్ట్ లను తయారు చేశానని, వాళ్లందరూ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్నారని అన్నారు.

 చాలా మందికి తాను శిక్షణ ఇచ్చానని, వారిలో ‘మెగా’ కుటుంబానికి చెందిన హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ఉన్నారని, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ వల్లే తాను వృద్ధిలోకి వచ్చానని సత్యానంద్ చెప్పారు. తాను ఎదిగే క్రమంలో దర్శకులు కేఎస్ రామారావు, రాఘవేంద్రరావు వంటి వారి సహకారం లభించిందని చెప్పారు. కాగా, కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘తేజ్ ఐలవ్ యూ’ వచ్చే నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాఖలో నిన్న నిర్వహించిన ఆడియో సక్సెస్ మీట్ లో సత్యానంద్ మాస్టర్ పాల్గొన్నారు.
Go Back to Shorts
Tollywood
Pawan Kalyan
satyanand master

More Telugu News